వెంకీ మామలో భళ్లాలదేవ?

Wednesday,January 30,2019 - 04:15 by Z_CLU

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా రాబోతోంది వెంకీమామ సినిమా. ఇప్పుడీ సినిమాలోకి మరో హీరో కూడా జాయిన్ అయ్యాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వెంకీ మామ ప్రాజెక్టులో ఓ గెస్ట్ ఎప్పీయరెన్స్ ఇవ్వబోతున్నాడు రానా. అయితే ప్రస్తుతానికి ఇదింకా గాసిప్ లెవెల్లోనే ఉంది.

బాబాయ్ వెంకీతో కలిసి నటించాలని రానా చాన్నాళ్లుగా ట్రై చేస్తున్నాడు. కానీ కుదరడం లేదు. మరోవైపు రానా చేసిన కృష్ణంవందే జగద్గురుంలో మాత్రం ఓ సాంగ్ లో వెంకీ ఇలా మెరుపులా మెరిసి మాయమౌతాడు. వెంకీ సినిమాలో మాత్రం రానా ఇప్పటివరకు కనిపించలేదు. వెంకీమామతో ఆ కోరిక తీరేట్టుంది.

శ్రియ, రకుల్ ప్రీత్ హీరోయిన్లగా బాబి దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది వెంకీ మామ. కోన ఫిలిం కార్పొరేషన్, సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లపై ఈ సినిమా రాబోతోంది.