హిరణ్యకశిప మరింత ఆలస్యం

Monday,December 21,2020 - 08:16 by Z_CLU

ఈ ఏడాది హిరణ్యకశిప రాలేదు. వచ్చే ఏడాది వస్తుందన్న ఆశ కూడా లేదు. ఎందుకంటే రానా (Rana) ఇప్పుడు చకచకా సినిమాలకు డేట్స్ ఇస్తున్నాడు. హిరణ్యకశిప ప్రాజెక్టును మాత్రం వెనక్కు నెడుతున్నాడు.

విరాటపర్వం సినిమాను పూర్తిచేసిన రానా.. వచ్చే నెల నుంచి అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీని సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. పవన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు. ఈ మూవీ తర్వాత మిలింద్ రావ్ దర్శకత్వంలో ధీరుడు అనే సినిమాకు కాల్షీట్లు కేటాయించాడు.

ఈ రెండు సినిమాల తర్వాత కూడా హిరణ్య కశిప సెట్స్ పైకి వచ్చేలా లేదు. ఎందుకంటే, ఓటీటీలో ఓ భారీ ప్రాజెక్టు చేయాలని నిర్ణయించుకున్నాడు రానా. ఆ తర్వాత మరో ప్రాజెక్టు ఏదీ సెట్ కాకపోతే హిరణ్యకశిప వస్తుంది. అంటే.. 2021లో కూడా గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్టు హిరణ్య కశిప డౌటే అన్నమాట.

మరోవైపు ఈ ప్రాజెక్టుకు త్రివిక్రమ్ మాటలు అందిస్తున్నాడనే టాక్ జోరుగా సాగుతోంది.

Also Check – రవన్నగా రానా