#Prabhas20 లో ఆ హీరో గెస్ట్ రోల్?

Tuesday,June 30,2020 - 02:05 by Z_CLU

అవును… రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమాలో ఓ హీరో గెస్ట్ రోల్ చేయబోతున్నాడట. ఆ హీరో మరెవరో కాదు దగ్గుబాటి రానా అని టాక్. ‘బాహుబలి’ ఫ్రాంచైజీతో ప్రభాస్, రానా మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. ప్రేక్షకులు కూడా ఈ కాంబోను బాగా ఎంజాయ్ చేశారు. అందుకే ఇప్పుడు తన సినిమా కోసం రానా ను గెస్ట్ రోల్ చేయమని అడిగాడట ప్రభాస్.

పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ప్రభాస్ సినిమాలో గెస్ట్ రోల్ చేయడానికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని మరోసారి ప్రభాస్ తో కలిసి నటిస్తాడని అంటున్నారు. అయితే సినిమాలో రానా రోల్ జస్ట్ కొన్ని నిమిషాలే ఉంటుందట. 5 నిమిషాల లోపే ఆ క్యారెక్టర్ ఉండనుందట.

మరి ఈ లవ్ స్టోరీలో రానా రోల్ ఏంటి..? అతడి లుక్ ఎలా ఉంటుందనేది హాట్ టాపిక్ గా మారింది. గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ పై కృష్ణంరాజు సమర్పిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ విడుదల చేయబోతున్నారు.