రానా ఘాజీ కలెక్షన్స్

Monday,February 20,2017 - 05:18 by Z_CLU

కొన్ని సినిమాలు కలెక్షన్స్ టార్గెట్ చేసుకుని తెరకెక్కితే, కొన్ని సినిమాలు మాత్రం హై ఎండ్ ప్యాషన్ తో తెరకెక్కుతాయి. ఘాజీ సెకండ్ క్యాటగిరీకి చెందింది. అయినా కలెక్షన్స్ దగ్గర ఏ మాత్రం తగ్గలేదు.

ఫిబ్రవరి 17 న రిలీజైన ఘాజి, పాజిటివ్ రివ్యూస్ తో పాటు, బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం తడబడకుండా స్టాండ్ అయింది. ఫస్ట్ వీకెండ్ 15.75 కోట్లు వసూలు చేసిన ఘాజి, రోజు రోజుకు ఆడియెన్స్ ని థియేటర్ కి రప్పించడంలో సక్సీడ్ అయింది.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజైన ఘాజి, తమిళంలో కాస్త స్లో పేజ్ లో నడుస్తున్నా, హిందే, తెలుగు భాషల్లో మాత్రం తన మార్క్ ని రిజిస్టర్ చేయడంలో సక్సెస్ అయింది. ఇక ఓవర్ సీస్ విషయానికి వస్తే ఇప్పటికే $450K వసూళ్లతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది ఘాజి.