ఫిబ్రవరిలో భల్లాలదేవుని యుద్ధం

Monday,December 05,2016 - 06:30 by Z_CLU

టాలీవుడ్ లో భల్లాల దేవుని యుద్ధం ఫిబ్రవరి 17 కల్లా రిలీజవుతుంది. బాహుబలి – ది కంక్లూజన్ లో రానా, ప్రభాస్ ల యుద్ధం ఎలా ఉండబోతుందో చూడాలని ఉత్సుకతతో ఉన్న ఫ్యాన్స్ కి , బాహుబలి రిలీజ్ కన్నా ముందే రానా ‘ఘాజి’ సినిమా రిలీజవుతుంది.

సబ్ మెరిన్ యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రానా లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన సినిమా యూనిట్, ఫిబ్రవరి 17 న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేసింది.

ఈ సినిమాలో రానా తో పాటు, తాప్సీ, K.K. మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా సంకల్ప్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. రానా పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీ స్థాయిలో రికార్డ్ అవుతున్నాయి.