భల్లాల దేవుని ఉగ్రరూపం

Wednesday,December 14,2016 - 02:30 by Z_CLU

బాహుబలి కంక్లూజన్ లో రానా ఫస్ట్ లుక్ రిలీజయింది. బాహుబలి స్టార్స్ బర్త్ డేస్ కి ఏదో రకంగా సర్ ప్రైజ్ చేసే సినిమా యూనిట్ ఈ సినిమాలో భల్లాల దేవుని ఉగ్రరూపాన్ని రిలీజ్ చేస్తూ, విషెస్ తెలిపింది.

rana-first-look-bahubali

బాహుబలిలో యంగ్ రానాని, మిడిల్ ఏజ్ రానాని ఆల్ రెడీ చూసేశారు కాబట్టి, పెద్దగా వేరియేషన్స్ ఎక్స్ పెక్ట్ చేయని ఫ్యాన్స్ కి ఈ ఫస్ట్ లుక్ చిన్న సైజు షాకే ఇచ్చింది.

బాహుబలి కంక్లూజన్ లోని వార్ సీక్వెన్సెస్ లో యాంగ్రీ బ్యాడ్ మ్యాన్ లా కనిపిస్తున్న రానా ఫస్ట్ లుక్, బర్త్ డే కి బెస్ట్ ట్రీట్ అని ఫీలవుతున్నారు ఫ్యాన్స్.