వినాయక్ తో సినిమాపై క్లారిటీ ఇచ్చిన రానా

Wednesday,June 21,2017 - 04:02 by Z_CLU

ప్రస్తుతం తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాతో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ చేస్తున్న రానా, ట్విట్టర్ లో ఆక్టివ్ గా ఉంటూ, తన ఫ్యూచర్ సినిమాల గురించి వస్తున్న రూమర్స్ కి అంతే ఓపిగ్గా క్లారిటీ ఇచ్చాడు.

బాహుబలి 2 సినిమా తరవాత మళ్ళీ ఇండివిజ్యువల్ ప్లాట్ ఫామ్ పై డిఫెరెంట్ సినిమాలను ఎంచుకుంటూ కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్న రానాతో వినాయక్ సినిమా సెట్స్ పైకి రానుందనే రూమర్ ఈ మధ్య టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ విషయంపై చాలా కూల్ గా క్లారిటీ ఇచ్చాడు రానా.

 

నా ఫ్యూచర్ సినిమాల గురించి అంతలా కష్టపడి రూమర్స్ క్రియేట్ చేయొద్దు, ఏమైనా ఉంటే నేనే అప్ డేట్ చేస్తాను అని చెప్పాడు రానా. ఇదిలా ఉంటే రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రేలర్ ఈ నెల 23 న మార్నింగ్ 10 గంటల నుండి సోషల్ మీడియాలో సందడి చేయనుంది.