క్వారంటైన్ టైమ్ లో రానా రివర్స్

Saturday,April 04,2020 - 11:32 by Z_CLU

ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇంట్లోనే ఉన్న హీరోలంతా బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇంట్లోనే ఎక్సర్ సైజులు చేస్తూ ఫిజిక్ కాపాడుకుంటున్నారు. ఏది పడితే అది తినకుండా డైట్ ఫాలో అవుతున్నారు. అయితే రానా మాత్రం ఈ విషయంలో రివర్స్ అయ్యాడు.

పూర్తిగా ఇంటికే పరిమితమైన రానా తనకు ఇష్టమైనవన్నీ లాగించేస్తున్నాడు. మరీ ముఖ్యంగా గుడ్లు ఓ రేంజ్ లో తింటున్నాడు. తనకు ఏం కావాలో ఇంట్లో చెప్పి మరీ చేయించుకుంటున్నాడు. రానా ఇలా ఒక్కసారిగా తిండి పెంచడానికి ఓ రీజన్ ఉంది.

రీసెంట్ గా కాస్త అనారోగ్యానికి గురవ్వడంతో రానా బాగా తగ్గిపోయాడు. దీనికి తోడు అరణ్య సినిమాలో చేసిన అతడు చేసిన పాత్ర కోసం కూడా తగ్గాల్సి వచ్చింది. 35 ఏళ్ల రానా ఈ సినిమాలో బాణదేవ్ అనే అడవి మనిషి పాత్రలో కనిపించనున్నాడు. ఆ పాత్ర కోసం ఆయన చాలా కఠినమైన ఆహార నియమాల్ని పాటించడమే కాకుండా, కఠిన శిక్షణతో 30 కిలోల బరువు తగ్గాడు.

అరణ్య వర్క్ పూర్తవ్వడంతో ఇప్పుడు మరోసారి తన ఫిజిక్ పై దృష్టిపెట్టాడు రానా. ఇందులో భాగంగా మంచి ఫిజిక్ కసం ఎక్సర్ సైజులు చేస్తూనే, ఇంట్లో బాగా ఫుడ్ లాగిస్తున్నాడు.