RanaNaidu - దగ్గుబాటి హీరోల మల్టీస్టారర్
Wednesday,September 22,2021 - 04:26 by Z_CLU
గత కొన్ని రోజులుగా దగ్గుబాటి హీరోలు విక్టరీ వెంకటేష్ , రానా కాంబోలో వెబ్ సిరీస్ రాబోతుందన్న ప్రచారం జరుగుతుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఇద్దరి లుక్ తో పాటు డీటెయిల్స్ బయటికొచ్చాయి. రీసెంట్ గా వెంకీ , రానా లపై లుక్ టెస్ట్ చేసి ఫోటో షూట్ చేశారు. అందులో ఓ స్టిల్ ఇప్పుడు బయటికి వదిలి సిరీస్ టైటిల్ కూడా ప్రకటించారు. ఈ ఇద్దరి కాంబోలో రాబోతున్న సిరీస్ కి రానా నాయుడు అనే టైటిల్ పెట్టారు. ఇక ఈ సిరీస్ లుక్ డిఫరెంట్ గా ఉండనుందని స్టిల్ చూస్తేనే అర్థమైపోతుంది.
గతంలో ఓ OTT సంస్థతో సిరీస్ కి సైన్ చేశాడు రానా. ఎట్టకేలకు ఇప్పటికి ఆ సిరీస్ చేయబోతున్నాడు రానా. ఇందులో రానా బాబాయ్ వెంకీ కి కూడా చోటు కలిపించారు మేకర్స్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో సిరీస్ అంటే ఆసక్తిగా ఉంటుందని ప్లాన్ చేసుకున్నారు. పైగా వెంకటేష్ ఉండటంతో తెలుగు ఆడియన్స్ కూడా ఈ సిరీస్ చూసేందుకు మక్కువ చూపిస్తారని భావించారు. అందుకే వెంకీ , రానా కాంబినేషన్ లో #RanaNaidu వెబ్ సిరీస్ రాబోతుంది.
ఈ సిరీస్ ని కరణ్ అంశుమాన్ , సుపర్న్ ఎస్ .వర్మ డైరెక్ట్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ సిరీస్ సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం వెంకటేష్ ‘F3’, రానా ‘భీమ్లా నాయక్’ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఆ రెండు సినిమాలకు సంబంధించి షూటింగ్ పూర్తవ్వగానే రానా నాయుడు షూట్ మొదలు కానుంది. ఇందులో టాలీవుడ్ లోని నటీ నటులతో పాటు బాలీవుడ్ యాక్టర్స్ నటించనున్నారని సమాచారం. ఇక మేకర్స్ రిలీజ్ చేసిన స్టిల్ లో వెంకీ స్టైలిష్ ఓల్డ్ మెన్ గెటప్ లో కనిపిస్తున్నాడు వెంకటేష్. మరి వెంకీ ఇందులో తనదైన హాస్యం పండిస్తారా? లేదా సీరియస్ రోల్ లో కనిపిస్తారా ? తెలియాల్సి ఉంది.
- – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics