ఓ ఇంటివాడైన రానా

Sunday,August 09,2020 - 09:53 by Z_CLU

హీరో రానా ఓ ఇంటివాడయ్యాడు. తన లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ మిహీకా బజాజ్ మెడలో మూడు ముళ్లు వేశాడు. రామానాయుడు స్టుడియోస్ లో రానా-మిహీకా పెళ్లి ఆర్భాటంగా జరిగింది.

రానా పెళ్లి కోసం సురేష్ బాబు భారీ ఏర్పాట్లు చేశారు. రామానాయుడు స్టుడియోస్ మొత్తాన్ని గ్రాండ్ గా అలంకరించారు. స్టుడియోలోని ఓ ప్రత్యేకమైన స్థలంలో కళ్లుచెదిరేలా పెళ్లి మంటపాన్ని ఏర్పాటుచేశారు.

లాక్ డౌన్ కావడంతో రానా-మిహీకా పెళ్లికి అతి తక్కువ మంది హాజరయ్యారు. రానా ఫ్రెండ్స్ రామ్ చరణ్, అల్లు అర్జున్ ఎటెండ్ అయ్యారు. నాగచైతన్య, సమంత స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.

రానా పెళ్లిని కొద్దిసేపు సురేష్ ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్ లో లైవ్ ఇచ్చారు. కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఇండస్ట్రీకి గ్రాండ్ పార్టీ ఇవ్వబోతున్నారు రానా-మిహీకా.