రానా కొత్త సినిమా షూటింగ్ పూర్తి

Friday,December 06,2019 - 12:07 by Z_CLU

రానా ‘అడవి రాముడు’ షూటింగ్ పూర్తయింది. నిన్నా మొన్నటి వరకు U.S. లోని ఎగ్జోటిక్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా యూనిట్ ఇకనుండి కంప్లీట్ ఫోకస్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పై పెట్టనుంది.

2017 లో రిలీజైన ‘నేనే రాజు నేనే మంత్రి’ తరవాత రానా మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్ సినిమా చేయలేదు. NTR బయోపిక్ లో కనిపించింది కాసేపే కాబట్టే, రానా మార్క్ సినిమా ఈ రెండేళ్లలో పడలేదనే చెప్పాలి. ఇపుడు తలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ ‘అడవి రాముడు’ తో మెస్మరైజ్ చేయబోతున్నాడు రానా.

ఈ సినిమా ఎగ్జాక్ట్ స్టోరీలైన్ లాంటివి ఇంకా రివీల్ కాలేదు కానీ, రానా పర్యావరణానికి సంబంధించిన ఆక్టివిస్ట్ లా నటించాడని తెలుస్తుంది.  ప్రభు సాల్మన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాని సమ్మర్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్.