మరో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ
Sunday,May 17,2020 - 03:53 by Z_CLU
ఓ శివగామి.. ఓ శైలజారెడ్డి.. ఓ శక్తిశేషాద్రి
శివగామి గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు. శైలజారెడ్డి గురించి కూడా చాలామందికి తెలుసు. త్వరలోనే శక్తి శేషాద్రిని కూడా చూడబోతున్నారు. అవును.. మరో పవర్ ఫుల్ పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారు. ఆమె నటించిన క్వీన్.. రేపట్నుంచి జీ తెలుగులో ప్రసారం అవుతుంది.

లేడీ సూపర్ స్టార్ గా… యంగెస్ట్ చీఫ్ మినిస్టర్ గా.. యావత్ రాష్ట్రానికి అమ్మగా.. ఇలా డిఫరెంట్ షేడ్స్ లో శక్తి శేషాద్రి పాత్రలో కనిపించనున్నారు రమ్యకృష్ణ. రేపట్నుంచి ప్రారంభం కానున్న ఈ సీరియల్.. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది.

ఈ ప్రతిష్టాత్మక, భారీ బడ్జెట్ సీరియల్ ను ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ డైరక్ట్ చేశాడు. ఈ సీరియల్ లో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నారు రమ్యకృష్ణ. అరుదుగా మాత్రమే ఇలాంటి రోల్స్ వస్తుంటాయని మిస్ చేసుకోకూడదని అన్నారు.
“నాకు మొదటి నుంచీ శక్తిమంతులైన మహిళల పాత్రలంటే ఇష్టం. ఎన్ని కష్టనష్టాలు వచ్చినా నిబ్బరంగా నిలబడే ఆడవాళ్లను నేను అభిమానిస్తా. వాళ్లు సామాన్యులైనా సరే. నా దృష్టిలో వాళ్లే రియల్ స్టార్స్. శక్తి శేషాద్రి క్యారెక్టర్ చేయబోతున్నందుకు గర్వంగా ఉంది. సంతోషంగానూ ఉంది. నేను అంత పవర్‌ఫుల్‌గా కనిపించడం కూడా నాకు నచ్చింది. అరుదుగా మాత్రమే ఇలాంటి రోల్స్ వస్తుంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు.”
క్వీన్ సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులు, బుల్లితెర వీక్షకుల ముందుకు రాబోతున్నారు మన రమ్యకృష్ణ. జీ తెలుగులో ఎక్స్ క్లూజివ్ గా ప్రసారం కానున్న ఈ సీరియల్ ను చూసి ఎంజాయ్ చేయండి.