ఈ నెలలోనే రిలీజ్ కానున్న రమ్యకృష్ణ మాతంగి

Tuesday,December 05,2017 - 01:05 by Z_CLU

రమ్యకృష్ణ లీడ్ రోల్ ప్లే చేసిన ‘మాతంగి’ ఈ నెల 15 న రిలీజ్ అవుతుంది. రీసెంట్ గా మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ మూవీ కృష్ణవంశీ పర్యవేక్షణలో పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుని, రిలీజ్ కి రెడీ అవుతుంది. అల్టిమేట్ హారర్ ఎలిమెంట్స్ తో పాటు, డివోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్, ఆడియెన్స్ లో స్పెషల్ ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేస్తుంది.

వినయ కృష్ణన్ నిర్మించిన ఈ సినిమాకి కన్నన్ తామరక్కులం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శ్రీనివాస విజువల్స్ బ్యానర్ పై తెలుగులో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి రతీష్ వేగ మ్యూజిక్ కంపోజర్.