ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్న రమ్యకృష్ణ మాతంగి

Wednesday,December 06,2017 - 01:36 by Z_CLU

రమ్యకృష్ణ లీడ్ రోల్ ప్లే చేసిన హారర్ డివోషనల్ ఎంటర్ టైనర్ ‘మాతంగి’ ఈ నెల 15 న గ్రాండ్ గా రిలీజవుతుంది. మలయాళంలో సూపర్ హిట్టయిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులోనూ అదే రేంజ్ లో ఎట్రాక్ట్ చేస్తుంది.  బిజినెస్‌పరంగా ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుండి క్రేజీ బిజినెస్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ చిత్రం డిసెంబర్‌ 15న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది.

రీసెంట్ గా మాతంగి’ థియేట్రికల్‌ ట్రైలర్‌ని ప్రసాద్‌ ప్రివ్యూ థియేటర్‌లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రమ్యకృష్ణ, డైరెక్టర్ నందినిరెడ్డి, చిత్ర నిర్మాత వినయ కృష్ణ వేదిక పై పాల్గొనగా రమ్యకృష్ణ ముద్దుల తనయుడు రుత్విక్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా నిలిచాడు.

 

ఈ సినిమా తెలుగులోనూ అంతే సక్సెస్ అవుతుందని కాన్ఫిడెంట్ గా  ఉన్న రమ్యకృష్ణ మాట్లాడుతూ – హారర్, కామెడీ, ఎమోషన్స్‌ అన్నీ ఈ చిత్రంలో వున్నాయి. ఈ చిత్రంలో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో నటించాను. ముఖ్యంగా ‘అమ్మోరు’ షేడ్స్‌ వున్న క్యారెక్టర్‌ చాలా ఇంట్రెస్టింగ్‌గా వుంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. ఈ చిన్న ప్రయత్నాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను.” అని చెప్పింది.