శైలజా రెడ్డి సెట్స్ పైకి వచ్చేసింది

Thursday,June 21,2018 - 04:30 by Z_CLU

సినిమా పేరు శైలజారెడ్డి అల్లుడు. ఇందులో హీరోహీరోయిన్లు నాగచైతన్య, అను ఎమ్మాన్యుయేల్. ఇద్దరూ కలిసి చాలా పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశారు. కానీ టైటిల్ పాత్రధారి శైలజారెడ్డి మాత్రం సెట్స్ పైకి రాలేదు. ఎట్టకేలకు ఆ టైం రానే వచ్చింది. శైలజారెడ్డి అలియాస్ రమ్యకృష్ణ సెట్స్ పైకి వచ్చేసింది.

ఈ సినిమాలో నాగచైతన్యకు అత్తగా, అను ఎమ్మాన్యుయేల్ కు అమ్మగా రమ్యకృష్ణ కనిపించనుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే రెగ్యులర్ గా ఉండే అత్త-అమ్మ లాంటి పాత్రలకు భిన్నంగా, సమ్ థింగ్ స్పెషల్ గా రమ్యకృష్ణ పాత్రను మలిచాడట దర్శకుడు మారుతి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. రమ్యకృష్ణ, నాగచైతన్య మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారట. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయబోతున్నారు.