NTR30... పవర్ ఫుల్ పాత్రలో సీనియర్ హీరోయిన్?

Sunday,September 20,2020 - 03:35 by Z_CLU

ఇటివలే ఎనౌన్స్ అయిన NTR-Trivikram కాంబినేషన్ సినిమా #NTR30 ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. RRR షూటింగ్ వాయిదా పడటంతో ఆలస్యమవుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్ళబోతుంది. అయితే ఇప్పుడీ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రచారం లోకొచ్చింది. Bahubali లో పవర్ ఫుల్ శివగామి పాత్రలో నటించిన Ramyakrishna ఇందులో ఓ స్పెషల్ రోల్ చేయనుందని ప్రచారం జరుగుతుంది.

గతంలో తారక్ హీరోగా నటించిన ‘నా అల్లుడు’ సినిమాలో అత్త పాత్రలో కనిపించింది రమ్యకృష్ణ. మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఎన్టీఆర్ సినిమాలో నటించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. Haarika Hassine Creations, NTR Arts సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు Thaman మ్యూజిక్ అందించనున్నాడు.