బంగార్రాజు మూవీ నుండి ర‌మ్య‌కృష్ణ స్పెష‌ల్ బ‌ర్త్‌డే పోస్ట‌ర్ విడుద‌ల‌

Thursday,September 16,2021 - 01:49 by Z_CLU

బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ `సోగ్గాడే చిన్ని నాయనా` సీక్వెల్ `బంగార్రాజు` కోసం నాగార్జున-రమ్యకృష్ణ మరోసారి కలిసి న‌టిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నాగ చైతన్య మ‌రో హీరోగా న‌టిస్తున్నారు.  నాగ‌చైత‌న్య‌ సరసన కృతి శెట్టి  హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రమ్యకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సత్యభామగా ఆమె లుక్‌ను విడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో నాగార్జున మరియు రమ్యకృష్ణ సంప్రదాయ వస్త్రధారణలో న‌ది ఒడ్డున డ్యాన్స్ చేస్తున్నారు. వారిద్ద‌రి మ‌ధ్య మనోహరమైన కెమిస్ట్రీని మ‌నం చూడొచ్చు. ఈ వారిద్దరు చూడముచ్చటగా కనిపిస్తున్నారు.

టైటిల్ పాత్ర‌లో నాగార్జున న‌టిస్తుండ‌గా రమ్యకృష్ణ అతని భార్య సత్యభామగా కనిపించనుంది. ఈ ఇద్దరితో పాటు, ఇతర ప్రముఖ తారాగణం హైదరాబాద్ RFCలో జరుగుతున్న షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

Bangarraju Movie Nagarjuna Ramyakrishna (1)

కుటుంబ సభ్యులందరితో కలిసి చూసేలా  బంగార్రాజును అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా  ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ రూపొందిస్తున్నారు. ఇది అన్ని వ‌ర్గాల వారిని అల‌రించ‌నుంది.

అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నాగార్జున నిర్మాత. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండ‌గా, సత్యానంద్ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. యువరాజ్ సినిమాటోగ్రాఫర్.

తారాగణం: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, కృతిశెట్టి, చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ మరియు జాన్సీ

సాంకేతిక వ‌ర్గం:
కథ, దర్శకత్వం: కళ్యాణ్ కృష్ణ కురసాల
నిర్మాత: అక్కినేని నాగార్జున
బ్యానర్లు: జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్
స్క్రీన్ ప్లే: సత్యానంద్
సంగీతం: అనూప్ రూబెన్స్
DOP: యువరాజ్
ఆర్ట్‌: బ్రహ్మ కడలి
PRO: వంశీ-శేఖర్

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics