ఉన్నది ఒకటే జందగీ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్

Saturday,October 28,2017 - 02:36 by Z_CLU

కంప్లీట్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఉన్నది ఒకటే జిందగీ సినిమాకు అన్ని ఏరియాస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరు మూవీ కాన్సెప్ట్ ను మెచ్చుకుంటున్నారు. ఈమధ్య కాలంలో ఫ్రెండ్ షిప్ పై వచ్చిన అతికొద్ది సినిమాల్లో ఇదొకటని అంటున్నారు. అలా కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ మధ్య థియేటర్లలోకి వచ్చిన రామ్ సినిమా వసూళ్లలో కూడా ది బెస్ట్ నంబర్స్ రికార్డు చేస్తోంది. రామ్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనర్ గా నిలిచింది ఉన్నది ఒకటే జిందగీ.

అటు ఓవర్సీస్ నుంచి ఈ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. హార్ట్ టచింగ్ సీన్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఓవర్సీస్ జనం మెస్మరైజ్ అవుతున్నారు. రామ్, శ్రీవిష్ణు పెర్ఫార్మెన్స్ ను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. అలా ఓవర్సీస్ లో కూడా రామ్ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా నిలవనుంది ఉన్నది ఒకటే జిందగీ.

తాజా అప్ డేట్స్ ప్రకారం.. ఓవర్సీస్ లో ఈ సినిమాకు ప్రీమియర్స్ తో కలుపుకొని లక్షా 79వేల డాలర్లు వచ్చాయి. ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడంతో.. వీకెండ్ కంప్లీట్ అయ్యేసరికి రామ్ సినిమాకు మరిన్ని వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు ట్రేడ్ ఎనలిస్టులు. ఓవరాల్ గా ఓవర్సీస్ లో రామ్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీగా ఇది నిలిచే అవకాశం ఉందంటున్నారు.