ప్రస్తుతానికి సస్పెన్స్

Wednesday,October 05,2016 - 05:41 by Z_CLU

 

ఈ ఏడాది ‘నేను శైలజ’,’హైపర్’ సినిమాలతో వరుస విజయాలు అందుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ తన 15 వ చిత్రాన్ని ఏ దర్శకుడి తో చేయబోతున్నాడా? అనే  వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ బ్లైండ్ పాత్రతో తన 15 వ సినిమా చేయనున్నట్లు ప్రకటించిన రామ్ తాజాగా  ఆ సినిమా ఇప్పుడే ఉండదంటూ ట్వీట్ చేసాడు.  తన 15 వ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలోనే ఎనౌన్స్ చేస్తానని తెలిపాడు..

ram-tweet-capture

        మరి  ఉన్నట్టుండి రామ్ ఈ నిర్ణయం తీసుకోవడం  వెనుక కథ ఏమిటా? అనే ప్రశ్న అందరిలో మొదలైంది. తాజాగా అనీల్ రావిపూడి, హీరో ఎన్టీఆర్ కు ఓ కథ వినిపించాడట. ఈ నేపథ్యంలో రామ్ చేసిన ట్వీట్ అందర్నీ కన్ఫ్యూజన్ లో పడేసింది. రామ్ 15 వ ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్.