

Saturday,August 20,2016 - 09:46 by Z_CLU
ఎనర్జిటిక్ స్టార్ రామ్, డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ హైపర్. ప్రతి ఇంట్లో ఒకడుంటాడు అనేది ఈ సినిమా ట్యాగ్ లైన్. ఈ చిత్రం వైజాగ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దీంతో 3 పాటలు మినహా టోటల్‌గా టాకీపార్ట్ పూర్తయింది. సెప్టెంబర్ రెండో వారంలో ఆడియో రిలీజ్ చేసి సెప్టెంబర్ 30న విజయదశమి కానుకగా ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. రామ్ సరసన రాశి ఖన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి, ప్రభాస్ శ్రీను, తులసి, హేమ, ప్రియ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంగీతం జిబ్రాన్. నేను శైలజ హిట్ తర్వాత హైపర్ తో మరోసారి అదే ఊపును కొనసాగించాలనే కసితో హైపర్ ను పూర్తిచేస్తున్నాడు రామ్. దర్శకుడు సంతోష్ శ్రీనివాసే.. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కూడా సమకూరుస్తున్నాడు.
Wednesday,March 22,2023 08:19 by Z_CLU
Monday,November 07,2022 01:51 by Z_CLU
Monday,August 22,2022 03:28 by Z_CLU
Wednesday,June 08,2022 03:47 by Z_CLU