మరికొన్ని గంటల్లో రంగస్థలం టీజర్

Wednesday,January 24,2018 - 12:19 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ రంగస్థలం సినిమా నుంచి మరికొన్ని గంటల్లో టీజర్ రాబోతోంది. ఈరోజు సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నారు. రామ్ చరణ్ సినిమా టీజర్ అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కానీ రంగస్థలం టీజర్ పై ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వడానికి కేవలం చరణ్ మాత్రమే కాదు. అంతకుమించి చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి.

ఈ సినిమాపై క్యూరియాసిటీకి ముఖ్యమైన రీజన్ ఈ స్టోరీలైన్. 1985 కాలానికి చెందిన ఓ కథతో రంగస్థలం సినిమాను తెరకెక్కిస్తున్నారు. చరణ్ గెటప్ నుంచి యాంబియన్స్ వరకు ప్రతి విషయంలో ఎంతో కేర్ తీసుకొని ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అప్పటి వాతావరణం, పరిస్థితుల్ని చూడాలనే తపన ప్రతి ప్రేక్షకుడిలో ఉంది.

ఇక ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో కారణం చెర్రీ-సుకుమార్ కాంబినేషన్. హీరోల్ని డిఫరెంట్ గా ప్రజెంట్ చేసే సుక్కూ, ఈ సినిమా కోసం చెర్రీని ఇప్పటికే పూర్తిగా మార్చేశారు. తన జీవితంలో చరణ్ ఎప్పుడూ ఇంత గడ్డం పెంచి ఉండడు. లుక్ ఓ రీజన్ అయితే, ఈ సినిమాలో చరణ్ క్యారెక్టర్ ఏంటనేది సినిమాపై ఆసక్తి పెంచడానికి మరో రీజన్.

రంగస్థలంపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచిన మరో ఎలిమెంట్ చరణ్-సమంత కాంబో. ఇది ఫ్రెష్ కాంబినేషన్ కావడం, పెళ్లి తర్వాత సమంత చేస్తున్న పెద్ద సినిమా ఇదే కావడంతో రంగస్థలం హాట్ టాపిక్ గా మారింది. ఇలా ఎన్నో అంచనాల మధ్య ఈరోజు సాయంత్రం విడుదలకాబోతోంది రంగస్థలం టీజర్.