రామ్ చరణ్ ఫినిషింగ్ టచ్

Wednesday,November 16,2016 - 12:26 by Z_CLU

రామ్ చరణ్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ధృవ థాయిలాండ్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. లాస్ట్ సాంగ్ కోసం థాయ్ వెళ్ళిన సినిమా యూనిట్ సక్సెస్ ఫుల్ గా సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుంది. షూటింగ్ లొకేషన్ లో ధృవ యూనిట్ కి థాంక్స్ చెప్పిన రామ్ చరణ్, ఆ వీడియోని సోషల్ నెట్ వర్క్ లో షేర్ చేశాడు. త్వరలోనే థియేటర్లలో కలుద్దాం అంటూ అందర్లో ఉత్సాహాన్ని నింపాడు.

స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ధృవ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. రీసెంట్ గా రిలీజైన ఆడియో ఇప్పటికే ధృవపై అన్ లిమిటెడ్ ఎక్స్ పెక్టేషన్స్ ని రైజ్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ లో విడుదలకానుంది.