ధృవ ట్రయిలర్ రివ్యూ

Friday,November 25,2016 - 08:21 by Z_CLU

ఎక్కడచూసినా ధృవ..ధృవ..ధృవ. ఎక్కడ విన్నా ధృవ ముచ్చట్లే. ఏ ఇద్దరు కలిసినా ధృవ సినిమా డిస్కషన్. ప్రస్తుతం మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ ఇదే. అందుకే ఇలా ట్రయిలర్ విడుదలైన వెంటనే యూట్యూబ్ షేక్ అయింది. క్షణానికి వెయ్యి చొప్పున వ్యూస్ పెరిగిపోతున్నాయి. మరి ఇంత హైప్ క్రియేట్ చేసిన ధృవ ట్రయిలర్ ఎలా ఉంది…? అందరి అంచనాలకు తగ్గట్టు ట్రయిలర్ ను కట్ చేశారా.. ఈ ట్రయిలర్ తో చెర్రీ తను అనుకున్నది సాధించాడా…? ధృవ ట్రయిలర్ రివ్యూను ఎక్స్ క్లూజివ్ గా మీకు అందిస్తోంది జీ-సినిమాలు.

నా మైండ్-నా ఫోకస్ అంతా వేరు. ట్రయిలర్ లో చెర్రీ చెప్పిన డైలాగ్ ఇది. తను ఏం చేయబోతున్నాడో…. దేన్ని టార్గెట్ చేశాడో చెర్రీ చెప్పకనే చెప్పాడు ఈ డైలాాగ్ తో. అవును.. ధృవ ట్రయిలర్ మామూలుగా లేదు. ఇదొక కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ లెంగ్త్ యాాక్షన్ ఉండబోతోందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా హీరో-విలన్ మధ్య కాన్ఫిక్ట్ సినిమాకు పెద్ద హైలెట్ కాబోతుందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమైపోతుంది.

dhruva-1

రకుల్ ప్రీత్ సింగ్ గతంలో చెర్రీతో బ్రూస్ లీ సినిమా చేసింది. కానీ ధృవలో వీళ్లది రిపీట్ పెయిర్ అనిపించడం లేదు. వెరీ ఫ్రెష్ కాంబినేషన్ ఫీలింగ్ కలుగుతోంది. ఇక తన పాాటలతో ఇప్పటికే అందర్నీ ఎట్రాక్ట్ చేసిన హిపాప్ తమీజాా… బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా అదరగొట్టాడు, ఓవరాల్ గా… ధృవ సినిమా విడుదలకు ముందే అభిమానులకు ఫుల్ మీల్స్ లాా మారిపోయింది. ట్రయిలర్ చూసిన తర్వాత మెగాఫ్యాన్స్ ఇక వెయిట్ చేయలేకపోతున్నారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సినిమా చూసేయాాలని ఫిక్స్ అయిపోయారు.