అభిమానులకు థ్యాంక్స్ చెప్పిన చెర్రీ

Saturday,December 24,2016 - 12:20 by Z_CLU

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకునే దిశగా దూసుకుపోతున్నాడు. చెర్రీ నటించిన లేటెస్ట్ మూవీ ధృవకు అన్ని ఏరియాస్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. మరీముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా ఇప్పటికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరడం రామ్ చరణ్ కు ఎక్కువ ఆనందాన్నిస్తోంది. అందుకే తన ఆనందాన్ని ఆడియన్స్ తో పంచుకునేందుకు థ్యాంక్స్ మీట్ ఏర్పాటుచేశాడు చరణ్. సాధారణంగా సినిమా హిట్ అయితే సక్సెస్ మీట్ పెట్టుకుంటారు. కానీ చరణ్ మాత్రం కృతజ్ఞతలు తెలిపేందుకు థ్యాంక్స్ మీట్ పెట్టాడు. ధృవ సినిమాను భారీ హిట్ చేసినందుకు ప్రేక్షకులందరికీ సెల్యూట్ చేశాడు. హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో చెర్రీతో పాటు… హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, డైరక్టర్ సురేందర్ రెడ్డి, నిర్మాత అల్లు అరవింద్. క్యారెక్టర్ నటులు పోసాని, నవదీప్ తదితరులు పాల్గొన్నారు.