Hot Topic - స్టార్ హీరోలతో శంకర్ మల్టీస్టారర్

Friday,January 22,2021 - 02:10 by Z_CLU

కొన్ని కాంబినేషన్ ప్రచారం అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు ఇండస్ట్రీలో కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ కాంబో న్యూస్ చక్కర్లు కొడుతూ నిజమేనా ? అన్న సందేహం కలిగిస్తుంది.

రామ్ చరణ్, యష్ ఈ కాంబినేషన్ లో సినిమా అంటే హాట్ టాపిక్ అవ్వకుండా ఉంటుందా? ఈ కాంబినేషన్ తో పాటు శంకర్ అనే స్టార్ డైరెక్టర్ ఎటాచ్ అయితే? సరిగ్గా ఇప్పుడు అదే ప్రచారం జరుగుతోంది.

Ramcharan Yash Multistarrer in Shankar Direction 2

నిజానికి ఈ కాంబోలో సినిమా వస్తుందా ? అసలు ఇందులో నిజమెంత ? అనేది పక్కన పెడితే రామ్ చరణ్, యష్ లతో శంకర్ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ మాత్రం ప్రస్తుతం మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం శంకర్ కమల్ హాసన్ తో భారతీయుడు 2 సినిమా చేస్తున్నాడు. అది పూర్తయ్యాక శంకర్ నెక్స్ట్ సినిమా డీటెయిల్స్ బయటికొస్తాయి. అప్పటి వరకు ఈ క్రేజీ మల్టీ స్టారర్ సినిమా వార్త నమ్మలేం.