ఫస్ట్ టైం విలేజ్ బ్యాక్ డ్రాప్

Friday,October 07,2016 - 10:06 by Z_CLU

సరికొత్త సినిమాలతో టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరొందిన సుకుమార్ నెక్స్ట్ సినిమాకు సిద్దమవుతున్నాడు. ‘నాన్నకు ప్రేమతో’ తర్వాత సుకుమార్ కాస్త గ్యాప్ తీసుకొని ఈ సినిమా కోసం డిఫరెంట్ స్క్రీన్ ప్లే రెడీ చేస్తున్నాడట. ఇప్పటికే రామ్ చరణ్ కు కథ వినిపించగా చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ‘ధ్రువ’ తరువాత మెగా పవర్ స్టార్ నటించబోయే సినిమా ఇదే.

ram-charan-village-backdrop-sukumar-1

ఇక మొన్నటి వరకూ చరణ్ కోసం సుక్కు ఓ సైన్స్ ఫిక్షన్ కథను సిద్ధం చేశాడనే టాక్ వినిపించగా తాజాగా చరణ్ తో సుకుమార్ ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కోసం కథను సిద్ధం చేసిన సుకుమార్ కథ కు తుది మెరుగులు దిద్దుతున్నాడట. మరి ఈ వార్తలో నిజం ఏంటో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.. నవంబర్ లేదా డిసెంబర్ లో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ప్రారంభం కానుందని సమాచారం..