వీకెండ్ లో సరదా సరదాగా చరణ్

Monday,April 17,2017 - 02:37 by Z_CLU

రోజు ఉదయం లేస్తే రాత్రి వరకు ఒకటే షూటింగ్స్. భారీ లైైట్ల కింద, మండుటెండల్లో టేకుల మీద టేకులు. ప్రతి హీరోకు ఇది అనుభవమే. అందుకే వీకెండ్ వచ్చిందంటే చాలు ప్రశాంతంగా ఉండాలనుకుంటారు. చెర్రీ కూడా అదే పని చేశాడు. ఇన్నాళ్లూ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో, మండే ఎండల మధ్య షూటింగ్ చేసిన చరణ్.. వీకెండ్ హైదరాబాాద్ చేరుకున్నాడు. చక్కగా తన ఇంట్లోనే రెస్ట్ తీసుకున్నాడు.

అయితే కేవలం రిలాక్స్ అవ్వడానికి మాత్రమే పరిమితమవ్వలేదు చెర్రీ. తన సొంత బ్యానర్ పై తండ్రి చిరంజీవి హీరోగా ఓ సినిమా ప్లాన్ చేశాడు. చిరంజీవి 151వ ప్రాజెక్టుగా రాబోతున్న ఆ సినిమా పేరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఈ సినిమాకు సంబంధించిన కథా చర్చల్లో పాల్గొన్నాడు చరణ్. దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి చర్చలు జరిపాడు. ఇదే టైమ్ లో సురేందర్ రెడ్డి పిల్లలతో సరదాగా గడిపాడు చరణ్. ఆ ఫొటోల్ని సోషల్ మీడియాలో కూడా షేర్ చేేశాడు.