రామ్ చరణ్ నిర్మాణంలో సుకుమార్ సినిమా?
Saturday,March 17,2018 - 04:20 by Z_CLU
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ‘రంగస్థలం’ సినిమాను తెరకెక్కిస్తున్న క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇటివలే ఈ సినిమాను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యాడు. రంగస్థలం తర్వాత సుకుమార్ చేయబోయే నెక్స్ట్ సినిమా కూడా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఉండబోతుందని సమాచారం. అయితే చరణ్ నిర్మాణంలో కూడా సుకుమార్ ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది.
సుకుమార్ ను తన బ్యానర్ లో ఓ సినిమా చేయమని అడిగాడట చెర్రీ.. ఈ ఆఫర్ కి సుకుమార్ వెంటనే ఓకే చెప్పెసినట్లు సమాచారం.
అయితే కొణిదెల ప్రొడక్షన్ లో సుకుమార్ చేయబోయే సినిమాకు టైం పడుతుందట. మైత్రి మూవీ మేకర్స్ తో చేయబోయే సినిమా తర్వాత సుక్కు తన ‘సుకుమార్ రైటింగ్స్’ బ్యానర్ లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడని ఆ సినిమా తర్వాతే చరణ్ నిర్మాణంలో సినిమా ఉంటుందని తెలుస్తుంది.