Ramcharan to attend Good Luck Sakhi function instead of Chiranjeevi
మరో రెండు రోజుల్లో అంటే జనవరి 28న కీర్తి సురేష్ టైటిల్ రోల్ లో నటించిన ‘గుడ్ లక్ సఖి’ థియేటర్స్ లోకి రాబోతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇవ్వాళ సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేసి దానికి గెస్ట్ గా మెగా స్టార్ చిరంజీవి ని పిలిచారు యూనిట్. చిరు వస్తానని చెప్పడంతో వెంటనే మెగా స్టార్ చీఫ్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అని ఎనౌన్స్ చేశారు.
చిరు గెస్ట్ గా ఎటెండ్ అవుతున్నారనగానే గుడ్ లక్ సఖి ఈవెంట్ కి ఎటెన్షన్ వచ్చింది. అయితే ఈ ఉదయమే చిరంజీవి కోవిడ్ పాజిటివ్ అంటూ ట్వీట్ చేశారు. ఇక గుడ్ లక్ సఖి ఈవెంట్ కి ఆయన రారని యూనిట్ అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు చిరు ప్లేస్ లో సాయంత్రం చరణ్ కనిపించబోతున్నారు. టీంకి ఈవెంట్ కి వస్తానని మాటిచ్చిన కారణం చేత తన స్థానంలో గెస్ట్ గా చరణ్ ని పంపిస్తున్నట్లు చిరు టీంకి తెలియజేశారు.
సో సాయంత్రం తండ్రి నిలబడాల్సిన స్థానంలో చరణ్ గెస్ట్ గా వచ్చి టీం కి గుడ్ లక్ చెప్పనున్నారు. మరి చిరు రాని లోటుని తనయుడు చరణ్ ఎలా తీరుస్తారో టీంలో ఎలాంటి జోష్ తీసుకొస్తారో చూడాలి. ఆది పినిశెట్టి , జగపతి బాబు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు నగేష్ కుకునూర్ దర్శకుడు. సాయంత్రం హైదరాబాద్ లోని పార్క్ హైయత్ లో ఈవెంట్ జరగనుంది.