Sukumar - విజయ్ తర్వాత చేయబోయే సినిమా అదే?

Saturday,April 24,2021 - 04:20 by Z_CLU

ప్రస్తుతం అల్లు అర్జున్ తో ‘పుష్ప’ సినిమా చేస్తున్న సుకుమార్ నెక్స్ట్ విజయ్ దేవరకొండ తో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ‘పుష్ప’ షూట్ పూర్తయిన వెంటనే సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో మళ్ళీ సినిమా చేయనున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తుంది.

చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత చరణ్ చిట్టి బాబుగా ప్రేక్షకుల గుండెల్లో ముద్ర వేసుకున్నాడు. అందుకే ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో సుక్కు ఉన్నాడని టాక్.

ramcharan-sukumar-rangasthalam-sequel-zeecinemalu

ఇటివలే చరణ్ ని కలిసి ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేశాడట సుకుమార్. తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం ఇచ్చిన సుకుమార్ స్క్రిప్ట్ చెప్పడమే ఆలస్యం చెర్రీ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడని టాక్. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో తారక్ తో కలిసి ‘RRR’ సినిమా చేస్తున్న చరణ్ నెక్స్ట్ శంకర్ డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా జూన్ లేదా జులై నుండి సెట్స్ పైకి వెళ్ళబోతుంది.

ఇక సుకుమార్ పుష్ప షూటింగ్ పూర్తి చేసి విజయ్ సినిమా కంప్లీట్ చేసే లోపు చరణ్ శంకర్ సినిమా పూర్తి చేసి సుక్కు తో టీమప్ అవుతాడని అంటున్నారు. ఈ కాంబో సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుందని తెలుస్తుంది.

ramcharan-sukumar-rangasthalam-sequel-zeecinemalu

అయితే నిజంగా వీరిద్దరూ రంగస్థలం కి సీక్వెల్ చేస్తారా… లేదా మరో కథ ఎంచుకొని దానికి రంగస్థలం-2 అని టైటిల్ పెడతారా… అనేది తెలియాల్సి ఉంది. మరి సుక్కు -రామ్ చరణ్ ఈ సారి ఎలాంటి కథతో వస్తారో..? ఏ రేంజ్ హిట్ అందుకుంటారో చూడాలి.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics