రామ్ చరణ్ కొత్త సినిమా పేరు రంగస్థలం

Friday,June 09,2017 - 10:23 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ అయింది. ఈ మూవీకి రంగస్థలం అనే పేరు ఫిక్స్ చేశారు. సినిమా విడుదల తేదీని కూడా గ్రాండ్ గా ఎనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రంగస్థలం సినిమాను థియేటర్లలోకి తీసుకొస్తామని ప్రకటించింది యూనిట్.

మొన్నటివరకు ఈ సినిమా స్టోరీపై చాలా ప్రచారం జరిగింది. 80ల నాటి కథతో సినిమా రాబోతోందంటూ రూమర్స్ వినిపించాయి. అవన్నీ నిజమేననే విషయం తాజాగా తేలింది. రంగస్థలం అనే టైటిల్ కింద 1985 అని ప్రింట్ చేశాడు సుకుమార్. అంటే, 1985 నాటి పల్లెటూరి ప్రేమ కథగా రంగస్థలం సినిమా రాబోతోందన్నమాట.

రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.