హాట్ టాపిక్ గా మారిన చెర్రీ సినిమా పోస్టర్

Monday,January 30,2017 - 07:06 by Z_CLU

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న రామ్ చరణ్, సుకుమార్ సినిమా అఫీషియల్ గా లాంచ్ అయింది. అయితే ఈ అకేషనల్ లో ఇంకో ఇంటరెస్టింగ్ ఎలిమెంట్ చోటు చేసుకుంది. ఈ సినిమా డైరెక్టర్ సుకుమార్ జస్ట్ సినిమా లాంచ్ అని రొటీన్ గా క్లోజ్ చేయకుండా ఓ ఇంటరెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేశాడు. అదే ఇప్పుడు హాట్ టాపిక్.

ఈ సినిమా గురించి ముందుగానే అనౌన్స్ చేసినట్టు 80, 90 ల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. ఆ విషయం పోస్టర్ రిలీజ్ కూడా కాకముందే తెలిసిపోయింది. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన ఈ పోస్టర్ చాలా ఎలిమెంట్స్ ని ఎలివేట్ చేస్తుంది.

రెండు కవాడి కుండలు మోస్తూ కనిపిస్తున్న రామ్ చరణ్ గెటప్ సినిమా థీమ్ ని ఎలివేట్ చేస్తూనే, రామ్ చరణ్ గత 10 సినిమాలకి, ఈ సినిమాకి ఏ మాత్రం పొంతన ఉండదని, ఒక్క పోస్టర్ తో తేల్చి చెప్పేసింది. మోకాళ్ళకు పైన లుంగీ కట్టుకుని, న్యాచురల్ గెటప్ లో కనిపిస్తున్న చెర్రీ సినిమా పోస్టర్, ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ డిజైరబుల్ డిస్కషన్ టాపిక్ లా మారింది.