రామ్ చరణ్ -సుకుమార్ సినిమా అప్డేట్స్
Thursday,March 16,2017 - 07:05 by Z_CLU
ప్రెజెంట్ సుకుమార్ తో సినిమా చేయబోతున్న రామ్ చరణ్ త్వరలోనే ఆ సినిమాతో సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసిన సుకుమార్ లొకేషన్స్ , ఆర్టిస్టులను కూడా ఫైనలైజ్ చేసేయడంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతుంది యూనిట్..
మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన సమంత కథానాయికగా నటించనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ చివరి దశలో ఉన్న ఈ సినిమా మార్చ్ 20 , లేదా ఏప్రిల్ 1న ప్రారంభమై వెస్ట్ గోదావరి జిల్లాలో అందమైన లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకోనుందని సమాచారం. మరి ఫస్ట్ టైం పల్లెటూరి కుర్రాడిగా కనిపించబోతున్న చెర్రీ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు… పల్లెటూరి యాస తో ఎలా ఎంటర్టైన్ చేస్తాడా…అని వెయిట్ చేస్తున్నారు మెగా ఫాన్స్..