చరణ్ సినిమా.. మళ్లీ మొదలైంది..

Tuesday,May 09,2017 - 11:16 by Z_CLU

మండే ఎండల్ని సైతం లెక్కచేయకుండా షూటింగ్ లో పాల్గొన్నాడు రామ్ చరణ్. అలా రాజమండ్రి, పోలవరం పరిసర ప్రాంతాల్లో దాదాపు నెల రోజుల పాటు షూటింగ్ చేసిన చెర్రీ.. ఫస్ట్ షెడ్యూల్ ముగించి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ విశ్రాంతి కూడా పూర్తయింది. చరణ్-సుకుమార్ సినిమా సెకెండ్ షెడ్యూల్ ప్రారంభమైంది. ఈరోజు నుంచి హైదరాబాద్ లో ఈ మూవీ షూటింగ్ కొనసాగుతోంది.

డిఫరెంట్ స్టోరీలైన్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని వర్కింగ్ స్టిల్స్ బయటకొచ్చి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా పంచెకట్టులో సమంత ఉన్న స్టిల్ కిర్రాక్ పుట్టిస్తోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అచ్చమైన పల్లెటూరి కుర్రాడిలా కనిపించబోతున్నాడు చరణ్. జగపతిబాబు, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.