అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న రంగస్థలం సెట్

Saturday,October 21,2017 - 04:03 by Z_CLU

1980ల నాటి కథతో రంగస్థలం సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సుకుమార్ డైరక్టర్. ప్రస్తుతం సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. అన్నపూర్ణ స్టుడియోస్ లో ఈ సినిమా కోసం ప్రత్యేకంగా సెట్స్ వేశారు. 1980ల నాటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. వీటికి సంబంధించి ఫస్ట్ టైం ఓ స్టిల్ రిలీజ్ చేశాడు రామ్ చరణ్.

గోలీ సోడా, గోల్డ్ స్పాట్ డ్రింక్, టూత్ పౌడర్, మట్టి కుండలు, బీడీ కట్టలు, ఎడ్ల బండి, సోడా తయారుచేసే మెషీన్.. 80ల్లో పాపులర్ అయిన ప్రాడెక్ట్స్ ఇవి. ఇవన్నీ రంగస్థలం షూటింగ్ లో కనిపించబోతున్నాయి. చెర్రీ విడుదల చేసిన పిక్ చూస్తే ఈ విషయం అర్థమౌతుంది.


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.