Exclusive - #RC15 షూటింగ్ అప్ డేట్స్ !

Friday,February 04,2022 - 02:48 by Z_CLU

Ramcharan Shankar Movie Updates

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మోస్ట్ ఎవైటింగ్ మూవీ #RC15 సినిమా తాజాగా రెండు షెడ్యుల్స్ జరుపుకుంది. దాదాపు 25 రోజుల పాటు జరిగిన షెడ్యుల్స్ లో ఒక సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలు , యాక్షన్ ఎపిసోడ్స్ తీశారు. శంకర్ కెరీర్ లోనే ఇది ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా అనుకోవచ్చు.

యూనిట్ త్వరలోనే మరో షెడ్యుల్ స్టార్ట్ చేయబోతున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో యూనిట్ రాజమండ్రి బయలుదేరనున్నారు. అక్కడ కొన్ని సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మరో షెడ్యుల్ జరగనుంది. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీలో కొన్ని సెట్స్ వేస్తున్నారు. అలాగే అమృత్ సర్ మిగతా ప్రదేశాల్లో కూడా షూటింగ్ చేయబోతున్నారు. ప్రస్తుతం ఆర్ట్ డైరెక్టర్ అండ్ టీంతో కలిసి పంజాబ్ లో లోకేషన్స్ రెక్కి చేస్తున్నారు శంకర్.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్ పై 50వ సినిమాగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు దిల్ రాజు. ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవేళ అనుకున్న విధంగా షూట్ పూర్తి కాకపోతే వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. రామ్ చరణ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.