Ramcharan Shankar Movie - రేపే గ్రాండ్ లాంఛ్

Tuesday,September 07,2021 - 01:23 by Z_CLU

శంకర్ -రామ్ చరణ్ కాంబినేషన్ లో దిల్ రాజు #RC15 నిర్మించబోతున్న సంగతి తెలిసిందే. మోస్ట్ ఎవైటింగ్ కాంబోగా వస్తున్న ఈ సినిమా రేపే లాంచ్ అవ్వనుంది. దీనికోసం అంతా రెడీ అవుతుంది. హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ప్రారంభోత్సవానికి మెగా స్టార్ చిరంజీవి , ఎన్టీఆర్, రాజమౌళి, కొరటాల శివలతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు హాజరవ్వనున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల నుండి షూటింగ్ మొదలు కానుందని సమాచారం. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ సబ్బాని, మోనికా నిగోత్రి భారీ సెట్స్ వేస్తున్నారు. ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ ప్లాన్ చేశారు మేకర్స్. రేపు సినిమాను లాంచ్ చేసి వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ జరిపే ఆలోచనలో ఉన్నారు.

rc15

రామ్ చరణ్ 15 వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా దిల్ రాజు బేనర్ లో వస్తున్న 50 సినిమా కావడం విశేషం. సినిమాకు సంబంధించి ఇప్పటికే కాస్ట్ అండ్ క్రూ ని ఫైనల్ చేసేశారు. చరణ్ సరసన కీయరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. చరణ్-కియరా కలిసి ‘వినయ విధేయ రామ’ సినిమాలో నటించారు. ఈ కాంబోలో రెండో సినిమా ఇది. తమన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.

గతంలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ‘బాయ్స్’ సినిమాలో తమన్ నటుడిగా కనిపించాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి శంకర్ తో కలిసి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నాడు. రాజు-శిరీష్ నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ 5 భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ కానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics