Ramcharan Shankar Movie - లేటెస్ట్ అప్ డేట్

Monday,August 16,2021 - 06:59 by Z_CLU

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా #RC15 త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ప్రస్తుతం అందిన సమాచారం మేరకు సినిమా సెప్టెంబర్ లో లాంచ్ కానుంది. వినాయకచవితి రోజున సినిమాను ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇటివలే రామ్ చరణ్ హీరోయిన్ గా కీయరా అద్వాని ని సెలెక్ట్ చేసి ఎనౌన్స్ చేసిన మేకర్స్ సినిమాలో మరో కీలక పాత్ర కోసం తమన్నా ని తీసుకోనున్నారని సమాచారం. తమన్నా ఇందులో విలన్ కి భార్యగా కనిపిస్తుందని టాక్.

సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.మొదటి షెడ్యుల్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఆర్ట్ డైరెక్టర్స్ రామకృష్ణ, మోనికా భారీ సెట్స్ వేస్తున్నారు. సెప్టెంబర్ లో సినిమాను లాంచ్ చేసి అదే నెలలో షూటింగ్ కూడా స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. మిగతా ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ డీటెయిల్స్ త్వరలోనే తెలియనున్నాయి. సినిమాలో సల్మాన్ ఖాన్ ఓ కీ రోల్ లో కనిపిస్తాడని అంటున్నారు. ఈ విషయంపై మేకర్స్ నుండి ఎలాంటి క్లారిటీ లేదు.

RAMCHARAN-to-romance-kiara-again-in-shankar-movie

ప్రస్తుతం RRR షూటింగ్ కోసం ఉక్రెయిన్ వెళ్ళాడు చరణ్. అక్కడ తారక్, చరణ్ లపై సాంగ్ షూట్ చేస్తున్నాడు రాజమౌళి. సెప్టెంబర్ మొదటి వారంలోపు RRR షూట్ ముగించుకొని శంకర్ సినిమాను స్టార్ట్ చేస్తాడు చెర్రి. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాడు నిర్మాత దిల్ రాజు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics