రామ్ చరణ్, సమంత సాంగ్ షూట్

Monday,April 03,2017 - 11:20 by Z_CLU

కెరీర్ లోనే ఫస్ట్ టైం రామ్ చరణ్ తో సినిమా చేస్తోంది సమంత. ఇవాళ్టి నుంచి చెర్రీ సినిమా సెట్స్ పై జాయిన్ అయింది. ప్రస్తుతం రామ్ చరణ్, సమంత పై ఓ సాంగ్ పిక్చరైజ్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ దీనికి కొరియోగ్రాఫీ చేస్తున్నారు. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సాంగ్ షూటింగ్ జరుగుతోంది.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నిన్ననే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. చెర్రీపై కొన్ని షాట్స్ పిక్చరైజ్ చేశారు. ఈరోజు సాంగ్ షూట్ ప్రారంభమైంది. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

సుకుమార్ దర్శకత్వంలో ఫస్ట్ టైం నటిస్తున్న రామ్ చరణ్, ఈ సినిమా కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యాడు. 90ల నాటి విలేజ్ బ్యాక్ డ్రాప్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఫస్ట్ షెడ్యూల్ కోసం ఏకంగా 35 రోజుల కాల్షీట్లు కేటాయించాడు చరణ్.