సుకుమార్ పై రామ్ చరణ్ ప్రెషర్

Monday,May 29,2017 - 10:43 by Z_CLU

రామ్ చరణ్-సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. సినిమా సెట్స్ పైకి వచ్చి దాదాపు నెల రోజుల పైనే అయింది. కానీ మూవీకి సంబంధించి ఇప్పటివరకు టైటిల్ ఎనౌన్స్ చేయలేదు. అందుకే సుకుమార్ పై ఒత్తిడి పెంచేందుకు రెడీ అయ్యాడు రామ్ చరణ్.

తొందరగా టైటిల్ ఎనౌన్స్ చేయాల్సిందిగా సుకుమార్ పై ప్రెషర్ పెట్టాలని రామ్ చరణ్, మెగాభిమానులకు రిక్వెస్ట్ చేశాడు. ఫ్యాన్స్ అంతా ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా సుకుమార్ పై ఒత్తిడి పెంచాలని కోరాడు. దీంతో నిన్నంతా సుకుమార్ కు సోషల్ మీడియాలో ఒకటే రిక్వెస్ట్ లు.

నిజానికి రామ్ చరణ్ కొత్త సినిమాకు సంబంధించి సుకుమార్ ఇప్పటికే 4 టైటిల్స్ అనుకున్నాడు. వాటిటలోంచి ఒకటి ఫిక్స్ చేయాల్సి ఉంది. సుకుమార్ అనుకున్న 4 టైటిల్స్ చాలా బాగున్నాయంటున్నాడు చరణ్. వాటిలోంచి ఒక టైటిల్ ను త్వరగా విడుదల చేయాలని సుకుమార్ ను రిక్వెస్ట్ చేస్తున్నాడు.