తేజు సినిమాకు చెర్రీ ప్రమోషన్

Thursday,June 28,2018 - 01:49 by Z_CLU

సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ తేజ్ ఐ లవ్ యు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ట్రయిలర్ క్లిక్ అవ్వడంతో, ఆ అంచనాలు ఇంకాస్త పెరిగాయి. సినిమా బాగుంటుందేమో అనే క్యూరియాసిటీ అందరిలో కలిగింది. రామ్ చరణ్ లో కూడా అదే ఫీలింగ్ కలిగింది. చూస్తుంటే, ఈసారి హిట్ అయ్యేలా ఉందంటూ పోస్ట్ పెట్టాడు చరణ్.

Nice visuals and music. Looks like a promising film from Karunakaran. Releasing on the 6th.. All the best to KS Rama Rao garu, Sai Dharam Tej and Anupama Parameswaran

Posted by Ram Charan on Wednesday, 27 June 2018

క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మాతగా తెరకెక్కింది తేజ్ ఐ లవ్ యు సినిమా. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించాడు.  వచ్చే నెల 6న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.