గ్యాంగ్ లీడర్ సీక్వెల్ చేస్తా..కానీ !

Thursday,January 10,2019 - 12:44 by Z_CLU

మెగా స్టార్ చిరంజీవి నటించిన ఆల్ టైం ఫేవరేట్ మూవీ ‘గ్యాంగ్ లీడర్’ సీక్వెల్ పై లేటెస్ట్ స్పందించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్…. ఇప్పటికే కొన్ని సందర్భాల్లో గ్యాంగ్ లీడర్ లాంటి సినిమా చేయాలనుందని చరణ్ తెలిపిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ‘వినయ విధేయ రామ ‘ ప్రమోషన్ లో భాగంగా ఈ విషయం పై మరోసారి మాట్లాడాడు చరణ్.

‘నిజానికి నాన్న గారు నటించిన గ్యాంగ్ లీడర్ కు సీక్వెల్ చేయాలని ఎప్పటి నుండో ఉంది.. కానీ దానికి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ దొరికితేనే చేస్తా.. ఆ సినిమా రేంజ్ లో కాకపోయినా, ఈ  సీక్వెల్ అభిమానులను మెప్పించేలా ఉండాలి. మంచి స్క్రిప్ట్ వచ్చినప్పుడే చేయాలని డిసైడ్ అయ్యాను.’ అని మనసులో మాట చెప్పుకున్నాడు చరణ్.

‘వినయ విధేయ రామ’ గ్యాంగ్ లీడర్ కథని పోలి ఉంటుందా… అనే విషయం పై కూడా స్పందించాడు చరణ్.. ఆ సినిమాకి ఈ సినిమాకి అస్సలు సంబంధం లేదని, ట్రైలర్ లో కొన్ని సీన్స్ , ఫ్యామిలీ బాండింగ్ చూసి అలా అనిపించొచ్చు కానీ రెండు సినిమాలకి ఎలాంటి పోలిక ఉండదని తెలిపాడు.