రాజమౌళి నాకేం చెప్పలేదు - చరణ్

Monday,March 26,2018 - 01:02 by Z_CLU

త్వరలోనే రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ రాబోతోంది. రాజమౌళి డైరక్ట్ చేయబోతున్నాడు ఈ సినిమాని. తెలుగుతెరపైనే అతిపెద్ద భారీ మల్టీస్టారర్స్ లో ఒకటిగా పేరుతెచ్చుకుంది ఈ సినిమా. ఇలాంటి ప్రాజెక్టుకు సంబంధించి తనకేం తెలియదంటున్నాడు చరణ్. పూర్తిస్థాయిలో ఇంకా చర్చలు జరగలేదంటున్నాడు.

ప్రస్తుతం రంగస్థలం ప్రమోషన్స్ లో ఉన్నాడు చెర్రీ. సో.. ఆటోమేటిగ్గా రాజమౌళితో చేయబోయే మల్టీస్టారర్ గురించి ప్రశ్న ఎదురవుతుంది. ఈ ప్రాజెక్టుపై ఎక్కడా మాట్లాడొద్దని రాజమౌళి తనకు ఫోన్ చేసి చెప్పారని, మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కు తనకు ఇంకా పూర్తిస్థాయిలో నెరేషన్ ఇవ్వలేదని అంటున్నాడు చరణ్. త్వరలోనే అందరం కూర్చొని సినిమాపై చర్చించుకుంటామని అంటున్నాడు.

ఈ భారీ మల్టీస్టారర్ గురించి ఎంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారంటే.. రీసెంట్ గా ఎన్టీఆర్, చెర్రీ కలిసి కాలిఫోర్నియా వెళ్లారు. రాజమౌళి సినిమా కోసం అక్కడ వీళ్లిద్దరిపై టెస్ట్ కట్ జరిగింది. కనీసం ఆ డీటెయిల్స్ కూడా షేర్ చేయడానికి ఇష్టపడలేదు చరణ్.