మహేష్ ఫంక్షన్ కు గెస్ట్ లు వీళ్లే!

Saturday,March 31,2018 - 01:56 by Z_CLU

ఏప్రిల్ 7న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగనుంది భరత్ అనే నేను మూవీ ఆడియో రిలీజ్ ఫంక్షన్. ఈ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో ఏకంగా ఎల్బీ స్టేడియంలో ఫంక్షన్ పెట్టారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్, రామ్ చరణ్ ను ముఖ్య అతిథులుగా పిలవాలని అనుకుంటున్నారు.

అటు ఎన్టీఆర్, ఇటు రామ్ చరణ్ ఇద్దరికీ మహేష్ బాబు క్లోజ్. కేవలం మహేష్ మాత్రమే కాదు, దర్శకుడు కొరటాల కూడా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్. సో.. వీళ్లిద్దరూ పర్సనల్ గా ఫోన్ చేసి మరీ ఆడియో ఫంక్షన్ కు రావాలని ఎన్టీఆర్, చరణ్ ను కోరారట. దీనికి వాళ్లు ఒప్పుుకున్నట్టు తెలుస్తోంది.

భరత్ అనే నేను మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో వస్తోంది. అందుకే ఆడియో ఫంక్షన్ కోసం ఎల్బీ స్టేడియంలో అసెంబ్లీ సెట్ వేయబోతున్నారు. ఈ సెట్ పై మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మెరవబోతున్నారు.

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్ సింగిల్ రిలీజైంది. రేపు సెకెండ్ సింగిల్ ను విడుదల చేయబోతున్నారు. ఈ సెకెండ్ సింగిల్ తో బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్.. గాయకుడిగా టాలీవుడ్ కు పరిచయమౌతున్నాడు.