RamCharan Shankar Movie - సరికొత్తగా రామ్ చరణ్

Tuesday,June 01,2021 - 07:02 by Z_CLU

మెగాస్టార్ చిరు తనయుడిగా ఆయన నుండి నట వారసత్వం అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ స్టార్టింగ్ నుండే డిఫరెంట్ మేకోవర్ ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. చిరుత నుండి మొన్నటి రంగస్థలం వరకూ చరణ్ చాలా డిఫరెంట్ లుక్స్ లో కనిపించాడు. ఇక రంగస్థలంలో చరణ్ మేకోవర్ చూసి ఆడియన్స్ కూడా షాకయ్యారు. ఆ సినిమాలో చిట్టి బాబు పాత్ర కోసం చరణ్ చాలా కేర్ తీసుకొని నేచురల్ లుక్ ట్రై చేసి మెప్పించాడు. అలాగే RRR లో అల్లూరి సీత రామరాజు పాత్ర కోసం కూడా చాలా కసరత్తులు చేసి ఫైనల్ గా తన లుక్ తో బాగా ఎట్రాక్ట్ చేశాడు చెర్రి.

ఇప్పుడు నెక్స్ట్ సినిమాలో కూడా అలాంటి న్యూ మేకోవర్ ట్రై చేసే ప్లాన్ లో ఉన్నారు రామ్ చరణ్. నెక్స్ట్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో #RC15 సినిమా చేయబోతున్నాడు చరణ్ ఆ సినిమాలో లుక్ డిఫరెంట్ గా ఉండేలా చూసుకుంటున్నాడట. హీరోలను డిఫరెంట్ గెటప్ లో చూపిస్తూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ క్రియేట్ చేసే డైరెక్టర్ శంకర్ చరణ్ కోసం అలాంటి న్యూ లుక్ ట్రై చేయనున్నాడట. చరణ్ కూడా ఆ గెటప్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ఆడియన్స్ ను సర్ ప్రయిజ్ చేయడనికి సిద్దమవుతున్నాడని తెలుస్తుంది.

ramcharan shankar movie

హీరో రామ్ చరణ్       దర్శకుడు శంకర్

RRR కి సంబంధించి కొంత షూట్ బ్యాలెన్స్ ఉంది. ఆ షూట్ ఫినిష్ అవ్వగానే తన నెక్స్ట్ సినిమా మేకోవర్ పై మరింత శ్రద్ధ పెట్టి వర్కౌట్స్ చేయనున్నాడు చరణ్. సినిమాలో చరణ్ ఎలా ఉంటాడో ? శంకర్ మెగా పవర్ స్టార్ ని ఎలాంటి గెటప్ లో చూపిస్తాడో అని ఇటు మెగా ఫ్యాన్స్ అటు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ మెగా లుక్ తో చరణ్ ఎలా మెప్పిస్తాడో ? వేచి చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న సినిమా జులై లేదా ఆగస్ట్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అన్ని అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలోనే సినిమా రిలీజ్ కానుంది.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics