చరణ్ చేతికి బన్నీ సినిమా?

Friday,August 07,2020 - 06:13 by Z_CLU

ఐకాన్.. అల్లు అర్జున్ అఫీషియల్ గా ఎనౌన్స్ చేసిన ప్రాజెక్టు. అంతేకాదు, ఆయన ఎంతో లైక్ చేసిన స్టోరీలైన్. కానీ అనుకోని పరిస్థితుల మధ్య బన్నీ ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడట.

ప్రస్తుతం పుష్ప సినిమా చేస్తున్న అల్లు అర్జున్, ఆ తర్వాత కొరటాల శివ సినిమాకు డేట్స్ ఇచ్చాడు. సో.. ఐకాన్ సినిమా ఇప్పట్లో లేనట్టే. అలా అని బన్నీ కోసం ఐకాన్ ను చాలా రోజుల పాటు అలాగే నాన్చడం దిల్ రాజుకు ఇష్టం లేదంట.

అందుకే ఇప్పుడీ ప్రాజెక్టు రామ్ చరణ్ దగ్గరకు వెళ్లినట్టు టాక్. ఐకాన్ స్క్రిప్ట్ మీద దిల్ రాజు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. వీలైనంత త్వరగా ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకురావాలనుకుంటున్నాడు. వీలైతే వకీల్ సాబ్ తర్వాత ఐకాన్ నే సెట్స్ పైకి తీసుకురావాలనే ఆలోచన కూడా ఉంది

అందుకే బన్నీ స్థానంలో రామ్ చరణ్ ను తీసుకోవాలని అనుకుంటున్నాడట దిల్ రాజు.

అటు చరణ్ మాత్రం ఇప్పటివరకు ఏ ప్రాజెక్టుకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కొత్త సినిమా ప్రకటించడానికి ఇంకాస్త టైమ్ తీసుకుంటున్నాడు ఈ మెగాపవర్ స్టార్.