ఆర్-ఆర్-ఆర్ లో రామ్ చరణ్ లుక్ ఇదే

Friday,August 02,2019 - 04:03 by Z_CLU

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతోంది ఆర్-ఆర్-ఆర్ మూవీ. ఈ సినిమాకు సంబంధించి వీళ్ల లుక్స్ లో ఎలాంటి తేడా కనిపించలేదు. హెయిర్ స్టయిల్, ఫిజిక్ లో ఎలాంటి మార్పుల్లేవ్. దీంతో ఆర్-ఆర్-ఆర్ లో రెగ్యులర్ గానే ఈ హీరోలిద్దరూ కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ ఈ సినిమా కోసం హీరోలు ఇప్పుడిప్పుడే మారుతున్నారు. ముందుగా రామ్ చరణ్ నయా లుక్ వచ్చేసింది.

చూశారుగా.. ఆర్-ఆర్-ఆర్ కోసం చరణ్ ఇలా మీసాలు పెంచాడు. రీసెంట్ గా చరణ్ బయట కనిపించలేదు. ముంబయిలో మాత్రం మీడియాకు ఇలా కొత్త లుక్ లో కనిపించాడు. కియరా అద్వానీతో కలిసి బయటకొచ్చినప్పుడు చరణ్ ఇలా బాలీవుడ్ మీడియాకు దొరికిపోయాడు.

చరణ్ లుక్ తో ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ పై కూడా క్యూరియాసిటీ పెరిగింది. తారక్ కూడా చాన్నాళ్లుగా బయట కనిపించడం లేదు. సో.. అతడు కూడా ఓ కొత్త లుక్ లో కచ్చితంగా కనిపిస్తాడనే ప్రచారం నడుస్తోంది.

త్వరలోనే ఆర్-ఆర్-ఆర్ సినిమాకు సంబంధించి తమిళనాడులో ఓ భారీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఏకంగా 35 రోజుల షెడ్యూల్ ఇది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు డీవీవీ దానయ్య నిర్మాత