Acharya - సిద్ధ వచ్చేశాడు

Saturday,March 27,2021 - 01:07 by Z_CLU

చరణ్ పుట్టినరోజు సందర్భంగా Acharya Movie నుంచి కూడా మరో బ్రాండ్ న్యూ పోస్టర్ వచ్చేసింది. ఈ సినిమాలో సిద్ధ అనే పాత్రలో కనిపించబోతున్నాడు రామ్ చరణ్. ఆ లుక్ కు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు.

కేవలం సిద్ధ లుక్ లో చరణ్ ను మాత్రమే రివీల్ చేయకుండా.. చిరు-చరణ్ కలిసున్న ఫొటోను విడుదల చేసి ఫ్యాన్స్ లో ఆనందాన్ని డబుల్ చేసింది ఆచార్య యూనిట్.

acharya chiranjeevi ramcharan 2

నక్సలైట్ పాత్రల్లో ఆచార్యగా చిరంజీవి, సిద్ధగా చరణ్.. చేతిలో తుపాకులు పట్టుకొని మోస్ట్ ఎగ్రెసివ్ గా కనిపిస్తున్నారు. ఇద్దరూ ఇద్దరే అన్నట్టుంది ఈ పోస్టర్.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను మే 13న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సినిమాలో Chiranjeevi సరసన Kajal, Ramcharam సరసన Pooja Hegde హీరోయిన్లుగా నటిస్తున్నారు.