నేనే హీరో.. నేనే నిర్మాత.. చరణ్ నయా ఫార్ములా

Tuesday,July 11,2017 - 10:38 by Z_CLU

రామ్ చరణ్ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. కొణెదల ప్రొడక్షన్స్ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా చిరంజీవి 150వ సినిమాను నిర్మించాడు చెర్రీ. ప్రస్తుతం తన సొంత బ్యానర్ పై చిరంజీవి 151వ సినిమా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కూడా నిర్మించబోతున్నాడు. ఇప్పుడు ఇదే బ్యానర్ పై తనే నిర్మాత, తనే హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడు చరణ్.

కొరటాల శివ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా ఓకే అయింది. ఈ సినిమాను సొంత బ్యానర్ పై నిర్మించాలని ఫిక్స్ అయ్యాడు చెర్రీ. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ మూవీ ప్రారంభం అవుతుంది. ఈ గ్యాప్ లో మహేష్ తో భరత్ అనే నేను సినిమాను కంప్లీట్ చేస్తాడు కొరటాల.

నిజానికి కొరటాల దర్శకత్వంలో ఈ పాటికే చరణ్ ఓ సినిమా చేయాల్సింది. మూవీ ఓపెనింగ్ కూడా అయింది. కానీ అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు వీళ్లిద్దరి కాంబినేషన్ వర్కవుట్ అయింది.