మరోసారి ఆ కాంబో ఫిక్స్ అవుతుందా?

Sunday,July 12,2020 - 12:36 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ RRR తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేస్తాడనే విషయంపై అభిమానుల్లో చర్చ నడుస్తుంది. ఇప్పటికే లిస్టులో ఇద్దరు ముగ్గురు దర్శకులు ఉండగా చరణ్ – వంశీ పైడిపల్లి కాంబో సినిమాపై ప్రచారం జరుగుతోంది.

వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఎవడు’ సినిమా వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం నమోదు చేసుకుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళిద్దరూ మరో బ్లాక్ బస్టర్ డెలివరీ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారని టాక్.

లేటెస్ట్ గా చరణ్ ను కలిసి ఓ స్క్రిప్ట్ చెప్పాడట వంశీ పైడిపల్లి. పాయింట్ నచ్చడంతో చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అన్ని కుదిరితే RRR తర్వాత రామ్ చరణ్ సినిమా వంశీ తోనే అని టాక్ వినబడుతుంది.

మహర్షి సినిమా రిలీజైన వెంటనే మహేష్ తోనే మరో మూవీకి రెడీ అయ్యాడు వంశీ పైడిపల్లి. కథ కూడా రెడీ చేశాడు. కానీ మహేష్ దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఇప్పుడు అదే కథతో చరణ్ తో సినిమా తీస్తాడా లేక మరో కథ సిద్ధం చేశాడా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.